Breaking News

జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 2. 65 లక్షల లీటర్లు సేకరించాం…

-పాడి రైతులకు 2. 60 కోట్ల రూపాయలు చెల్లించాం 
-ఇదే స్పూర్తితో మూడో ఫేజ్ గ్రామాలలో పాల సేకరణ జరగాలి : మండల అధికారులకు కలెక్టర్ జె. నివాస్ ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 2. 65 లక్షల లీటర్లు సేకరించి, 2. 60 కోట్ల రూపాయలు పాడి రైతులకు చెల్లించామని, ఇదే స్పూర్తితో మూడో ఫేజ్ మండలాల్లో కూడా జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కలెక్టర్ జె. నివాస్ అన్నారు. జగనన్న పాల వెల్లువ మూడో ఫేజ్ కార్యక్రమంపై విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి బుధవారం తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, పశు సంవర్ధక, సహకార శాఖ అధికారులు, గ్రామ, రూట్ ఇంచార్జి లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం మూడో ఫేజ్ కార్యక్రమం ద్వారా ఈనెల 11 వ తేదీ నుండి 93 గ్రామాలలో పాల సేకరణ జరుగుతుందన్నారు. మొదటి, రెండవ ఫేజ్ లలో 99 గ్రామాల నుండి రోజులు 6 వేల 200 లీటర్ల చొప్పున ఇంతవరకు 2. 65 లక్షల లీటర్లు సేకరించామని, పాడి రైతులకు ఇంతవరకు 2.60 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి పాడి రైతుల నుండి మంచి స్పందన వస్తున్నదన్నారు. ఇదే స్పూర్తితో మూడో ఫేజ్ మండలాల్లో కూడా పాల సేకరణ లక్ష్యాన్ని పెంచే దిశగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాల డైరీలతో పోలిస్తే అమూల్ డైరీ వారు పాలసేకరణ కు అందిస్తున్న ధర, పాడి రైతులకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు, పాడి పశువులకు మెరుగైన పోషకాలతో కూడిన దాణా , వైద్య సౌకర్యాలు, తదితర ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేయాలన్నారు. ఇందుకోసం ప్రతీ గ్రామంలోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి, గ్రామంలోని పాడి రైతులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. జగనన్న పాల వెల్లువ పధకంను ప్రతీ పాడి రైతు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేలా చూడాలన్నారు. జగనన్న పాల వెల్లువ మూడో ఫేజ్ లో నూజివీడు డివిజన్లలోని బాపులపాడు మండలంలోని 16 గ్రామాలు, ఆగిరిపల్లిలో 11, నూజివీడులో 18, ఏ .కొండూరు లో 15, మైలవరంలో 9, చాట్రాయి లో 3, గంపలగూడెం లో 5, రెడ్దగూడెంలో 4, తిరువూరు మండలంలోని 6 గ్రామాలలో ఈ నెల 11 వ తేదీ నుండి పాల సేకరణ జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి పాల సీకరణ కేంద్రాలలో వెన్న శాతం కొలిచేందుకు అవసరమైన కంప్యూటర్ పరికరాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ఇంటర్నెట్ , విద్యుత్ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జగనన్న పాల వెల్లువ పాల కేంద్రాలను పాలను అందిస్తున్న 805 మంది పాడి రైతులకు స్వల్పకాలిక రుణాలుగా 2. 55 కోట్ల రూపాయలు అందించడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా. కె. మాధవీలత, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ విద్యా సాగర్, జగనన్న పాల వెల్లువ కార్యక్రమం జిల్లా కోఆర్డినేటర్ లలిత్ కుమార్, ప్రభృతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *