విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, Ex. MLA బొండా ఉమామహేశ్వర రావు విలేకర్ల సమావేశం మొగల్రాజపురంలో జరిగింది. ఈ సమావేశంలో బొండా ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాటు సారా అక్రమ వ్యాపారానికి తెర లేపిందని అన్నారు. జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా వలన 26 మంది మరణానికి కారణం వైకాపా నాయకులే అని, జంగాెడ్డిగూడెం మరణాలు ప్రభత్వ హత్యలే అని, జంగారెడ్డి గూడెం మృతుల పై అసెంబ్లీ లో ముఖ్యమంత్రి హేళన చేసి మాట్లాడడం సరికాదు అని, ఫొటోలు, వీడియోలతో వాస్తవాలు బయటపెట్టిన ప్రభుత్వం ఏం పట్టనట్టు వ్యవహరిస్తుంది అని మండిపడ్డారు. దొంగ సారా కేసులు నమోదుకు ఎలా ఆమోదించారు అని ప్రశ్నించారు. వైకాపా చెప్పేవన్నీ అబద్దలనాటానికి జంగారెడ్డి గూడెం సంఘటన నిదర్శనం అని, నాటు సారా, గంజాయి, j బ్రాండ్, liquior ని అధికారికంగా అమ్ముకునే హక్కు వైకాపా నాయకుల కు కల్పించారు అన్నారు.. డబ్బు సంపాదనే లక్ష్యం గా వైకాపా పని చేస్తోంది గానీ ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ మృతులకు చెల్లించినట్లు జంగారెడ్డిగూడెం మృతులకు పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. అలాగే జనసెన సభ కి టిడిపి సబందం ఉందని మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. జనసెన ఆవిర్భావ సభ కి టీడీపీ కి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. టీడీపీ తో జనసేన పొత్తు పెట్టుకుంటే మీకెందుకు ఉలుకు అన్నారు. 7లక్షల కోట్లు అప్పుల రాష్ట్రం గా మార్చిన ఘనత వైసీపీ ది అని, దోచుకుని దాచుకోవడం వైసీపీ లక్ష్యం అని అన్నారు. ఇప్పటికే వైకాపా పని అయిపోయింది అని, ఎప్పుడు ఎన్నికల వచ్చినా వైకాపా ఇంటికెళ్ళడం ఖాయాం అని తెలియజేశారు. రాబోయే రోజుల్లో విస్తృతంగా ప్రజలలోకి వెళ్తాం అని తెలియజేశారు. పార్టీ పొత్తులు పై అధినేతలు మాట్లాడుకుంటారు అని, పొత్తులు టిడిపికి కొత్త కాదు అని పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లి పని చేస్తాం అని, ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, కల్తీ మద్యం అమ్మకాలతో చేసే హత్యలను గమనించి ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వం కి సరైన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, నేతలు దెంధుకురి మురళీ కృష్ణ రాజు, ఘంటా కృష్ణ మోహన్, గరిమెళ్ళ చిన్న, బాబి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …