Breaking News

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్, డాబా కోట్లు రోడ్డు, గంగానమ్మ గుడి సెంటర్ వద్ద గురువారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ (పార్టీ సభ్యత్వ నమోదు) కార్యక్రమం జరిగింది. ఈ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ చేరుకోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేయాలనే సంకల్పంతో డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ తీసుకువచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వలిబోయిన గురునాధం, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు పాల్గొని పార్టీ డిజిటల్ మెంబర్షిప్ సభ్యత్వములను చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వలిబోయిన గురునాధం మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని, ఈ రోజు ప్రపంచ దేశాల నరసన భారతదేశం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధికి, కృషికి నిదర్శనమని, ప్రస్తుతం ఈ దేశంలో ఉన్న సమస్యలను గట్టెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ చాలా అవసరమని, దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ పై విష ప్రచారం చేసి ప్రజలలో విద్వేషాలు, అపనమ్మకాన్ని కలిగించేలా చేయడం దుర్మార్గమని, ఈ దేశానికి గాంధీ కుటుంబం ఎనలేని సేవలు చేసిందని అన్నారు.
తదనంతరం నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో జరగబోయే 2024 ఎన్నికల గెలుపును డిసైడ్ చేయలేవనీ, దేశంలో రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని, దేశం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు.
ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి రాబోతుందని, దేశంలోని నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల్లేక అల్లాడి పోతున్నారని, ప్రస్తుతం కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాల పై విముఖతగా ఉన్నారని, నేడు దేశంలోని విద్యార్థి యువత రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవ్వాలని ఆకాంక్షిస్తున్నారనీ తెలియజేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఎన్.ఎస్.యు.ఐ. ధ్యేయం, లక్ష్యం శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించాలనే అనే నినాదంతో విద్యార్థి, యువత మరియు ప్రజల మధ్యకు వెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపిసిసి ఆర్.టి.ఐ. సెల్ చైర్మన్ పీ.వై.కిరణ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఠాపురపు ప్రమీలా గాంధీ, ఏపిసిసి మైనారిటీ ఉపాధ్యక్షులు ఎం.డి బేగ్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పిఠాపురపు సాంబశివరావు, విజయవాడ నగర బీసీ సెల్ చైర్మన్ వీరంకి రామచంద్ర రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ ఎస్.కె.మాబూవలీ, ఎం.శ్యామ్ ప్రసాద్, దమ్ము రాజు, దార్ల నరసింహారావు, కడగల శ్రీనివాసరావు, వేముల రామకృష్ణ మరియు ఎన్.యస్.యు.ఐ. నాయకులు బత్తుల అంకమ్మరాజు, ఉప్పు జస్వంత్, మోహన్, రవితేజ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *