మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వయో వృద్ధుల ఆశ్రమం ఒక వసుదైక కుటుంబమని, పెద్ద వయస్సు వారి అవసరాలు చూస్తూ, అనారోగ్య సమస్యలను పట్టించుకుంటూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముదిమివయస్సులో ఉన్నవారిని సంరక్షించుకోవాలని పండుటాకులకు మెండైన సేవ చేస్తేనే జీవితానికి సార్ధకతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపు నిచ్చారు.
శనివారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం ఈడేపల్లి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జెట్టి నరసింహం స్మారక వృద్ధాశ్రమం పెద్ద వయసు వారి అవసరాలు చూస్తూ, ఎన్నో పండుటాకులకు ఆశ్రయమిస్తోంది. మంత్రి పేర్ని నాని ఇక్కడ ఉంటున్న 51 మంది వృద్ధుల అనారోగ్య సమస్యలను పట్టించు కుంటూ వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కంటికి రెప్ప మాదిరిగా చూసుకుంటున్నారు. ప్రముఖ దంత వైద్యులు రావి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి లిఖిత, ప్రముఖ నేత్ర వైద్యులు ఆళ్ళ భాస్కరరెడ్డి ఎం.డి. ఇబ్రహీం, రాము తదితర వైద్య బృందం వృద్ధాశ్రమంలో పలువురికి పంటి, కంటికి సంబంధించిన వైద్య పరీక్షలు క్షుణంగా నిర్వహించారు. పి. నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు తన కంటి అద్దాలు బరువుగా మసగ్గా ఉన్నాయని మంత్రి పేర్ని నానికి తెలిపారు. డాక్టర్ గారు మీకు పరీక్షా చేసిన తర్వాత మీకు తప్పక మంచి తేలికైన కళ్లద్దాలు అమర్చుతారమ్మ అని చెప్పారు. దూరంగా ఉన్నవారిని సరిగా గుర్తు పట్టలేకపోతున్నానని గుత్తి శ్యామలరావు చెప్పగా, పి.రామస్వామి అనే మరో వృద్ధుడు తన కంటి నుండి నీరు కారుతుందని, వెలుతురు చూడలేకపోతున్నట్లు నేత్ర వైద్యులు భాస్కరరెడ్డికి తెలిపారు. ఆయన చిన్న బ్యాటరీలైట్ సహాయంతో ఆటో రిఫ్లెక్ట్ మెషిన్ ద్వారా పలువురు వృద్ధుల రెటీనాను పరీక్షించి కంటిలోశుక్లాలు ఉన్నవారిని గుర్తించారు. అలాగే పలువురు వృద్ధులకు నోటిలో దంతాలు సరిగా లేకపోవడంతో ఆహారంను సరిగా నమిలి మింగలేని పరిస్థితి ఉందని మరికొందరికి పుచ్చిపోయిన పన్నులను తొలగించాల్సిన ఆవశ్యకతను డాక్టర్ రవి శ్రీనివాసరావు, డాక్టర్ సాయి లిఖిత లు గుర్తించారు. చూపు సరిగా లేని వారిని గుర్తించి వారి కంటి పవర్ కు అనుగుణంగా ఫ్రేములతో కూడిన కళ్లజోళ్లు, పవర్ అద్దాలు త్వరలో ఇస్తామని, అలాగే దంతాలు లేనివారికి నోటిలో పండ్ల సెట్లు నాలుగైదు రోజులలో అమర్చుతారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అలాగే వృద్ధాశ్రమంలో అందరికి రక్తంలో హిమోగ్లోబిన్ శాతం, చక్కర శాతం, రక్తపోటు తెలుసుకొనేందుకు ల్యాబ్ టెక్నీషయన్లతో వచ్చి పరీక్షలు చేస్తామని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, బతకటానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్లిపోవడం బిడ్డలకు ఒక తప్పనిసరి అవసరమైతే, మరి పెంచి పోషించిన పెద్దల బాగోగుల పరిస్థితి సంగతేమిటని ప్రశ్నించారు. కన్నవారిని వృద్ధాశ్రమంలో ఉంచటం అంటే అమ్మానాన్న లను అనాధలను చేసిపోవటం కాదు.. వారికి తప్పనిసరి పరిస్థితిలో ఒక భద్రమైన చోటులో ఉంచటమని వారి పిల్లలు కొంతైన గ్రహించాలని అన్నారు.
రెండురోజుల క్రితం 85 సంవత్సరాల పోట్రు రామయ్య అనే వృద్ధుడు తమకు ఎపుడైనా అనారోగ్యం సంభవిస్తే ఆసుపత్రికి వెళ్లాలంటే, చాలా ఇబ్బందిగా ఉందని వృద్ధాశ్రమంలో ఒక పురుష సహాయకుడిని నియమించాలని మంత్రిని అభ్యర్ధించారు. కాగా 48 గంటల వ్యవధి గడవక ముందే మంత్రి పేర్ని నాని శనివారం నగరపాలక సంస్థ ఉద్యోగి యర్రంశెట్టి అనే ఉద్యోగిని వృద్ధాశ్రమంలో నియమించడంతో వృద్దులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ వైద్య పరీక్షలలో మంత్రి పేర్ని నాని వెంట 46 వ డివిజన్ బోగాది సాయిబాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కో – ఆప్షన్ సభ్యులు బేతపూడి రవి, ఆరోగ్య సంబంధిత విషయాలు పర్యవేక్షించే మంత్రి వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు, వృద్ధాశ్రమం సూపరెండెంట్ లక్ష్మి దుర్గ, జోగి కొండ, ప్రేమ్ జగన్, చెన్నూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …