ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాని స్వంత ఇంటికల సాకారం కావడానికి కృషి చేస్తున్నారు…

ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాని స్వంత ఇంటికల సాకారం కావడానికి కృషి చేస్తున్నారని, ఆ దిశలోనే 140 సిమెంట్ బస్తాలను తక్కువ ధరకు అందచేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. శనివారం ఆచంట మండలం కోడేరు గ్రామం లో ఇసుక ర్యాంపును సందర్శన, వల్లూరు, కరుగోరు మిల్లి,అయోధ్య లంక గ్రామాల్లో హౌస్ సైట్స్, లే అవుట్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, లక్షలు ఖరీదైన స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా, స్వంత ఇంటి నిర్మాణం చేసుకునేలా ప్రతి అడుగులోను సీఎం సూచనలు మేరకు అండగా నిలుస్తున్నా మన్నారు. లే అవుట్ల వద్దనే ఇసుక ను లబ్దిదారులకి అందచేయ్యడం జరుగుతోందన్నారు. ఇప్పుడే ఇంటి నిర్మాణం కోసం మనకు సమీపంలో ఉన్న కోడేరు ఇసుక ర్యాంపు ను అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. ఏ ఒక్క లబ్దిదారుడు ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలనే లక్ష్యం తో అడుగులు వేస్తున్నామన్నారు. సిమెంట్ బస్తాను రూ.240 కే పంపిణి కి చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రతి లబ్దిదారుడు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఆయా పనులు పూర్తి చేసుకున్న తర్వాత దశల వారీగా నగదు చెల్లింపు లను చేస్తున్నామని శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మాటలు నమ్మవద్దని ఇంటి నిర్మాణం కోసం డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రూ.35 వేలు ముందస్తు రుణం అందిస్తూ, ఆయా పనులు పూర్తి చేసిన నగదు రూపంలో వారి ఖాతాలకు జమ చెయ్యడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులచే చేపట్టే ఇంటి నిర్మాణం కోసం అదనంగా కేటాయించిన 50 బస్తాల ఖరీదు మంత్రి శ్రీరంగనాధ్ రాజు చెల్లించడానికి ముందుకు రావడం ఆయన ఔదార్యానికి నిదర్శనం లబ్దిదారులు స్థానికులు పేర్కొన్నారు. వల్లూరు గ్రామంలో ఉత్తర పాలెం, కరుగోరుమిల్లి లేవుట్ , అయోధ్యలంక లో జగనన్న హౌసింగ్ లే-అవుట్ ను సందర్శించారు. మెరక పనులు కోసం ఇప్పటికే రూ.12 లక్షలు ఖర్చు చేశానని, మరో మీటర్ మేర ఎత్తుకు కావసలసిన సహాయాన్ని కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచంట ఏఎంసీ చైర్మన్ సుంకర సీతారామ ఇందిరా, ఆచంట ప్రెసిడెంట్ కోట సరోజిని వెంకటేశ్వరరావు, కొడమంచిలి సర్పంచ్ సుంకర సీతారాం, బ్రహ్మం, పండు, తప్పెట్ల వెంకటేశ్వరరావు, ఊల్లం రామానుజన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *