ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు

-ఈనెల 27న ఖురాన్ ను కంఠస్తం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేయు కార్యక్రమానికి విచ్చేయాలని ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని ముస్లిం మైనార్టీ నాయకులు గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 27న అంబాపురంలోని మదర్సా ఇనామ్-ఉల్-ఉలూమ్ పాఠశాలలో పవిత్ర గ్రంథం ఖురాన్ ను కంఠస్తం చేసిన 22 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎమ్మెల్యేను కోరారు. అనంతరం మల్లాది విష్ణు గారికి ఆహ్వానపత్రికను అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో హఫీజుల్లా, మహమ్మద్ రఫీ, ముఫ్తీ హబీబ్ అహ్మద్, మహమ్మద్ షఫీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *