విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యా శాఖ,NCERT సంయుక్తం గా దేశ వ్యాప్తం గా 3 వ తరగతి విద్యార్ధులకు పునాది అక్షరాస్యత, సంఖ్యాత్మకత లో జాతీయ స్థాయి సాధన సర్వే(Foundational Learning Numeracy – National Achievement Survey) ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు నిర్వహిస్తోందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా పునాది స్థాయిలో ఈ అంశం మీద నిర్వ హించడం దేశంలో ఇదే మొదటిసారని తెలిపారు. మన రాష్ట్రంలో ఈ సర్వేను పాఠశాల విద్యా శాఖ కమీషనర్ కె. సురేష్ కుమార్ (ఐఏఎస్) , సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి (ఐఏఎస్) సారథ్యంలోలో మొత్తం 383పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో 197 ప్రభుత్వ, 76 ఎయిడెడ్ , 75 ప్రవేట్ , 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి . రాష్ట్రం లో ఈ సర్వేను 5 భాషలలో (తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ కన్నడ, ఒడియా) నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సర్వే నిర్వహణలో ఇద్దరు రాష్ట్ర స్థాయి సమన్వయ కర్తలు, జిల్లా స్థాయిలో 26 మంది సమన్వయకర్తలు, 251 మంది క్షేత్ర స్థాయి పరిశోధకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సర్వేలో మొత్తం 3830 మంది విద్యార్ధులను పరీక్షించనున్నారు. సర్వే విధానం మీద సంపూర్ణ అవగాహన కోసం సిబ్బందికి డ్రై రన్ కూడా నిర్వహించామని తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …