“ఎగుమతుల పనితీరు”లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్

-గుజరాత్ తర్వాత స్థానంలో నిలిచి సత్తా చాటిన ఏపీ
-పరిశ్రమల శాఖను ప్రశంసించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
-ఎగుమతుల పెంపే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వినూత్న చర్యలు
-“ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో 20వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్
-ఎగుమతుల వాతావరణంలో 10వ స్థానం, వాణిజ్య వాతావరణంలో 8వ స్థానం
-2021కి గానూ “ఎగుమతుల సంసిద్ధత సూచీ”ని విడుదల చేసిన నీతి ఆయోగ్
-పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో మెరుగైన ర్యాంక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టడమే లక్ష్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు విజయవంతమయ్యాయి. ఏపీ నుంచి ఎగుమతులు ఏడాదికేడాది వృద్ధిలో సాగుతున్నాయి. 2030 కల్లా రెట్టింపు ఎగుమతులు సాధించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ “ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో మెరుగైన ఫలితాలు సాధించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల వారీ స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తూ బ్రాండ్ సృష్టించడమే కాకుండా ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటింది.

పరిశ్రమల శాఖకు మంత్రి బుగ్గన ప్రశంసలు
నీతి ఆయోగ్ ప్రకటించిన “ఎగుమతుల సంసిద్ధత సూచీ-2021లో పనితీరు అంశంలో ఏపీ ద్వితీయ స్థానం దక్కించుకోవడం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న పరిశ్రమల శాఖ కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో ఆంధ్రప్రదేశ్ 11 స్థానాలు ఎగబాకడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

50.39 పాయింట్లతో 9వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్
“ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో మన రాష్ట్రం 9వ స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 50.39 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన “ఎగుమతుల సంసిద్ధత సూచీ-2021″లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 11 స్థానాలు పైకి ఎగబాకిందని కరికాల పేర్కొన్నారు. ఎగుమతుల వాతావరణంలో 10వ స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ వాణిజ్య వాతావరణంలో 8వ స్థానం దక్కించుకుందన్నారు. పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నట్లు కరికాల తెలిపారు. అయితే మొత్తం దేశ ఎగుమతుల్లో 78.86 పాయింట్లతో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, 77.14 పాయింట్లతో మహారాష్ట్ర రెండో స్థానం కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో 61.72 పాయింట్లతో కర్ణాటక, 56.84 పాయింట్లతో తమిళనాడు.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 5,6,7,8 స్థానాల్లో నిలిచిన హర్యాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ ల పాయింట్లను ఏపీ సాధించిన పాయింట్లతో పోలిస్తే కేవలం 1-2శాతం మాత్రమే వ్యత్యాసం ఉండడం గమనార్హం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *