దాతలు వితరణశీలులకు సమాజంలో ఉన్నత స్థానం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నంతలో ఇచ్చేవారు, ఎదుటివారి కష్టానికి స్పందించి ఆ వ్యక్తి లేక సమూహం బాగుపడాలని మనసారా కోరుకొనే గొప్ప వ్యక్తులు దాతలుగా వితరణశీలులగా సమాజంలో ఉన్నత స్థానాన్ని తప్పక పొందుతారని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో పలువురు దాతల సహకారంతో మంగళవారం మధ్యాహ్నం వివిధ వైద్య పరికరాలు వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధికి పలువురు దాతలు, వితరణశీలురు, ప్రవాసాంధ్రులు అందించిన స్ఫూర్తి, చేయూత సహకారం మరువలేనిదన్నారు, రోగుల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రి సంసిద్ధం కావడం, నిపుణులైన వైద్యుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందడం ఎంతో హర్షణీయమని మంత్రి అన్నారు.
ముందుగా ఆయన సిటీ స్కాన్ యూనిట్ వద్ద విడి భాగాలను పరిశీలించారు, అనంతరం భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ( బెల్ ) కంపెనీ 6 లక్షల రూపాయల విలువ కల్గిన వైద్య ఉపకరణాలు బెల్ జిఎం ప్రభాకర్ చొరవతో స్టీల్ స్ట్రెచ్చర్లు- 20 , రోగుల పల్స్ రేట్, హార్ట్ బీట్ తదితర పలు ఆరోగ్య తనిఖీలు ఒకేసారి చేసే పరికరం మల్టీ పారా మోనిటర్స్ – 6 అందచేశారని, అలాగే క్రాసా అనే స్వచ్ఛంద సేవ సంస్థ 8 లక్షల రూపాయల విలువ కల్గిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు – 6 , ఎన్ -95 మాస్కులు పదివేలు, సర్జికల్ మాస్కులు పదివేలు, 5 లీటర్ల శానిటైజర్లు, గ్లవుజులు తదితర సామాగ్రిను ఆశావర్కర్లు , ఏఎన్ ఎంలు , అంగన్వాడి సిబ్బందికి క్రాసా సంస్థ అందచేయడం ఎంతో అభినందనీయమన్నారు. అలాగే మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు బాడీగ రామకృష్ణ ప్రభుత్వాసుపత్రి భవిష్యత్ అవసరాల నిమిత్తం 3 లక్షల రూపాయల చెక్కును మంత్రి పేర్ని నాని స్వహస్తాల మీదుగా ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ జయకుమార్, ఆర్ ఎం ఓ డాక్టర్ కృష్ణ దొరకు అందచేశారు. గత ఏడాది సైతం బాడిగ రామకృష్ణ ఎంతో ఉదారంగా సహాయపడ్డారని, ప్రభుత్వాసుపత్రికి ఆకస్మికంగా రావాల్సిన సందర్భంలో డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఉపయోగపడే 12 లక్షల రూపాయల విలువ చేసే నిక్సాన్ కారును బహూకరించి కాల్ డ్యూటీ వాహనాన్ని సమకూర్చారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. ఇటీవల నాగాయలంక మండలం ఎదురుమొండిలో అయిదు ద్వీప గ్రామాల వైద్య సేవలకు అంబులెన్సు తప్పక అందిస్తానని బాడీగ రామకృష్ణ పెద్ద మనస్సు చాటుకున్నారని మంత్రి ప్రశంసించారు.
ఈ వితరణ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, చలమలశెట్టి గాంధీ, నిమ్మగడ్డ సత్య ప్రకాష్, ఉరిటి రాంబాబు , బెల్ కంపెనీ ఉద్యోగులు యూనియన్ నాయకులు క్రాసా స్వచ్ఛంద సంస్థ సభ్యులు. పలువురు వైద్యులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *