మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితంగా ఉండాలని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలో లబ్ధిదారులకు కేటాయించిన జగనన్న లేఔట్లను మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఆర్డీవో ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు తదితర ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు.
నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎక్కడా నిధులు కొరత అనే సమస్య లేదని మంత్రి స్పష్టం చేశారు. మండలంలో గిలకలదిండిలో 26 ఎకరాలలో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున ఇళ్లస్ధలం కేటాయించామని, బందరుకోటలో 10 ఎకరాలు, ఉల్లింగిపాలెంలో 17 ఎకరాలు లబ్ధిదారులకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమని, ఏమాత్రం కూడా అధికారులు అలసత్వంతో వ్యవహరించకూడదని మంత్రి పేర్ని నాని సూచించారు.
ఈ పరిశీలనా కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కమీషనర్ ఎస్. శివరామకృష్ణ, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఎం. డి. యాకూబ్, శొంఠి ఫరీద్, 20 వ డివిజన్ కార్పొరేటర్ తిరుమలశెట్టి వర ప్రసాద్ , 19 వ డివిజాన్ కార్పొరేటర్ శేషయ్య, జిల్లా మత్స్య కార సంఘం అధ్యక్షులు చింతా గోవింద రాజులు, విశ్వనాథపల్లి వీరబాబు, సచివాలయ సిబ్బంది, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …