మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త జిల్లాల నుండి పరిపాలన జరిపేందుకు అధికార యంత్రాంగం చక చక సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు కార్యాలయాలు విజయవాడ నుంచి మచిలీపట్నం తరలివస్తున్నాయి. మరోవైపు అద్దె భవనాలలో కునారిల్లుతున్న మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం ఏర్పాటుచేసిన భవనంలోని వచ్చి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని 12 వ డివిజన్ నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న సువిశాల ఆవరణ గల 1962 నాటి బందరు బీడీ కిళ్ళి వర్తక సంఘం భవన సముదాయం 43 గదులతో జరుగుతున్న మరమ్మతు పనులను మంగళవారం సాయంత్రం రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఆర్డీవో ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు తదితర ప్రభుత్వ అధికారులు పరిశీలించారు.
వచ్చే నెల 2 వ తేదీ ఉగాది పండుగ నుండి నూతన జిల్లాల ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఆ పనులలో నిమగ్నమయ్యారు. ఈ భవనంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, ఫారెస్ట్ ఆఫీస్, మైనింగ్ కార్యాలయం, రూరల్ వాటర్ స్కీమ్ కార్యాలయం, హార్టికల్చర్ కార్యాలయం రానున్నాయి.. ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ భవనానికి పలు మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. అవసరమైన కిటికీలు, దర్వాజాలు , మెష్ ఏర్పాటు, సీలింగ్, సిమెంట్ కోటింగ్, ఫ్లోరింగ్ పనులతో పాటు పెయింటింగ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ పనులను అధికారులు పర్యవేక్షించారు.త్వరలో ఇక్కడ పరిసరాలు ప్రభుత్వ ఉద్యోగుల హడావుడితో సందడి వాతావరణం నెలకొననుండ టంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …