శరవేగంగా ముస్తాబవుతున్న కొత్త కలెక్టరేట్‌ కార్యాలయం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త కలెక్టరేట్‌ నిర్మాణానికి సంబంధించిన పనులు త్తరిగతగతిన పూర్తి చేసి కార్యాలయాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ విజయవాడ కొత్త జిల్లాకు అవసరమైన కలెక్టరు కార్యాలయ ఏర్పాటుకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ కాంపౌండ్‌ లో జరుగుతున్న నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, ఆర్‌డివో యం వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ ఛాంబర్‌, వీడియోకాన్పరెన్స్‌, మీని కాన్ఫరెన్స్‌ హాల్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఛాంబర్‌, అనుబంధ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, మీటింగ్‌ హల్‌, డిఆర్‌వో కార్యాలయం, ఛాంబర్‌ ఏర్పాటుకు సంబంధించిన పనులను పరిశీలించి అధికారులకు పలు చూచనలు చేశారు. రేపటికల్ల పనులు పూర్తి చేసి కార్యాలయాలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గదులలో సిలింగ్‌ పనులు, టైల్స్‌ ఏర్పాటును పరిశీలించి నాణ్యతతో పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయాల ప్రాంగణ పరిసరాలు ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని పరిసరాలలో అందమైన మొక్కలను ఉంచాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు పూర్తయిన చాంబర్స్‌లలో ఫర్నిచర్‌ను సిద్దం చేయాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్‌వో కార్యాలయం లోకి ప్రవేశించే ప్రధాన మార్గంలో రహదారి పనులు పూర్తి చేసి చుట్టూ గార్డెనింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ తనను కలిసి ప్రాతికేయులతో మాట్లాడుతూ ఏప్రిల్‌ రెండో తేది నుండి ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో కొత్త కలెక్టరేట్‌ నుండి పరిపాలన ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దంగా ఉన్నామన్నారు. తిరువూరు, నందిగామ డివిజన్లకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణాల పనులు జరుగుతున్నాయన్నారు. కొత్త కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్‌ జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి అనుబంధంగా కలెక్టరేట్‌ సెక్షన్లు కూడా ఉంటాయన్నారు. కలెక్టరేట్‌ పరిపాలన విభాగం స్థానిక మాంటిస్సోరి కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే విభజన పూర్తయిందని అన్ని శాఖలకు సంబంధించి హెచ్‌ఓడిలు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే కొత్త జిల్లాలో విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నారని కలెక్టర్‌ అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి 2,880 వరకు అభ్యంతరాలు, విజ్ఞాపనలు సూచనలు వచ్చాయని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. వీటిలో ఎక్కువగా మార్పులకు సంబంధించి ఉన్నాయన్నారు. ఉయ్యారు, మైలవరం కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని, నూజివీడు డివిజన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలో కొనసాగించాలని ఎక్కువ ప్రతిపాదనలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్‌యంబి ఎస్‌ఇ శ్రీనివాస్‌మూర్తి, పంచాయతీరాజ్‌ ఇఇ ఎ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *