-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ వెల్లడించారు. కరోనా కారణంగా ప్రజల ఇబ్బందులను చూసి ప్రస్తుతం పాత చార్జీలు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మరింత దెబ్బ అని, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రో, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న తరుణంలో ఈ చార్జీల పెంపు తగదని అన్నారు. చార్జీలు తగ్గించని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగిస్తుందని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీ లను పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయాన్ని శైలజనాథ్ తప్పు పట్టారు. ఈఆర్‌సీ ప్రకటించిన వివరాల ప్రకారం 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంచారని, అలాగే, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నారని, మీ నిర్వహణ లోపం, చేతకానితనంతో పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తారా? అని శైలజానాథ్ ప్రశ్నించారు