విజయ కీలాద్రి దివ్యక్షేత్రం పై ఉగాది తెలుగుసంబరాలు…


అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శుభకృత్ తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖలు, ఏ. పి. టూరిజం డేవలప్మెంట్ కార్పొరేషన్, సహకారంతో… సాంస్కృతిక సాంఘీక సేవా సంస్థ ‘జయహో భారతీయం’ ఆధ్వర్యంలోప్రకాశం బ్యారేజ్ సమీపంలో ని సీతానగర్ లో జీయర్ ఆశ్రమ ప్రాంగణంలోనాలుగు రోజులపాటు జరిగే ఉగాది తెలుగు సంబరాలలో భాగంగా ఈరోజు కోలాట మహోత్సవంను పోలీస్ ఉన్నంతధికారి కమాన్డంట్ కొండా నరసింహారావు, అలవేలు మంగ దంపతులు శంఖ నాదం చేసి పూరించగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానూజ అహోబిలం జీయర్ స్వామి వారు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే కళలు మన సంప్రదాయాన్ని, సంస్కృతి నీ సంరక్షిస్థాయని అన్నారు. తెలుగు గొప్పదనాన్ని మన సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక, భక్తి ప్రాభవాన్ని చాటిచెప్పే విధంగా మార్చి 30, 31, ఏప్రిల్ 1,2 తేదీలలో ఉగాది తెలుగుసంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమాలు కేవలం భక్తి, సంస్కృతి, సంప్రదాయ విలువలకు అద్దం పట్టేవి అన్నారు.ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి అధ్యక్షులు గోళ్ళా నారాయణ మాట్లాడుతూ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లనుంచి తొలి రోజు 50 బృంద కళాకారులు పాల్గొన్నారు.న్యాయనిర్ణేతల సమక్షంలో కోలాట పోటీలు నిర్వహించి, రాష్ట్రస్థాయిలో ప్రధమ ద్వితీయ, తృతీయ బహుమతులు గా 30,000/- 25,000/-,20,000/- 20 ప్రోత్సాహక నగదు బహుమతులు ఇస్తున్నారన్నారు.పోలీస్ ఉన్నంతధికారి కమాన్డంట్ కొండా నరసింహారవును కళాకారులకు సర్టిఫికెట్, మేమంటోస్ అందించి సత్కరించారు.కార్యక్రమంలో వ్యాఖ్యాతగా టీటీడీ మాజీ అధికారి కుమార్ వ్యవరించారు.cvk ప్రసాద్,జయహో భారతీయం అధ్యక్షులు వల్లీశ్వర్, నాట్య ఆచారిని హవిషా చౌదరి, ఘంటసాల పవన్ కుమార్, సప్పా శివకుమార్ లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *