-ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శుభకృత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు అకాడమిఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ శనివారం ఉదయం గం.10 లకు విజయవాడ కొత్తపేటలోని కె.బి.ఎన్. కళాశాల సమావేశమందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఉగాది పంచాంగ పఠనం చేస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హయ్యర్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమీషన్ పోలా భాస్కర్, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ‘అకాడమి’ డైరెక్టర్ శ్రీ వి.రామకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్.సుశీలమ్మ అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. వివిధరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు అకాడమి పక్షాన ఉగాది పురస్కారాలు అందజేస్తామన్నారు.
ఉగాది పురస్కార గ్రహీతలవివరాలు
1. ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి (ప్రాచీన సాహిత్యం)
2. డాక్టర్ శాంతి నారాయణ (కథా సాహిత్యం)
3. శ్రీ ‘రంగం’ రాజేష్ (జానపదం)
4. శ్రీమతి కోకా విజయలక్ష్మి (కూచిపూడినృత్యం)
5. శ్రీ నల్లి ధర్మారావు (పత్రికారంగం)
6. శ్రీసంజయ్ కిశోర్ (కళాసేవ)
7. శ్రీ శంకర నారాయణ (హాస్యావధానం)