ప్రతి పేదవాడికి సంక్షేమ లబ్ది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి సంక్షేమనికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ యార్లగడ్డ అప్పారావు వీధి, కాకతీయ బజార్ నందు ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, అభివృద్ధి కి సమప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగింస్తుంటే ప్రతిపక్ష టీడీపీ కేవలం వారి రాజకీయ మనుగడ కోసం అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నాయి అని ఎద్దేవా చేశారు. ప్రజలకి వాస్తవాలు వివరించి ప్రభుత్వానికి వారి మద్దతు కోసమే ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ డివిజన్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే దాదాపు ఆరు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు కోసం కేటాయించడం జరిగిందని,ఈ యార్లగడ్డ అప్పారావు వీధి నందు దాదాపు 10లక్షల రూపాయల ప్రభుత్వ నిధులు వెచ్చించి కల్వర్టు పనులు పూర్తి చేపించమని అన్నారు.అదేవిధంగా డివిజన్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ బెల్లం దుర్గ,12వ డివిజన్ ఇంచార్జ్ నవీన్,అధ్యక్షులు రిజ్వాన్,దనేకుల కాళీ,కార్పొరేటర్లు అమర్నాధ్, రామిరెడ్డి,కలపాల అంబేద్కర్, కొండారెడ్డి మరియు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *