రాష్ట్రంలో 24/7 నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నాం..

-నూతన విద్యుత్ టారిఫ్ విధానం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది..
-ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే రూ. 11,123 కోట్లు సబ్సిడీ భరిస్తుంది..
-ఉచిత విద్యుత్ రూ. 9513 కోట్లు సబ్సిడీ, డొమెస్టిక్ రూ. 4,037 కోట్లు సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుంది..
-సింగల్ టెలిస్కోపింగ్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరుగుతాయి..
-ప్రతి సంవత్సరం 14 శాతం ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది..
-రాష్ట్రంలో 74 శాతం ధర్మల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు..
-బొగ్గు రేట్లు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడం వలెనే చార్జీలు పెరిగాయి..
-ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 24/7 నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఏ పి ఇ ఆర్ సి విద్యుత్ టారిఫ్ ను విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు.
విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయ మీడియా పాయింట్ వద్ద గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ నూతనంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ బాగా పెరగనున్నదని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించిన తరువాత 2022-23 నూతన విద్యుత్ టారిఫ్ ను ఆమోదించిందన్నారు. విద్యుత్ వినియోగంలో 50 శాతం జనాభా 75 యూనిట్ ల లోపు టారిఫ్ లోకి వస్తారని, 50 శాతం మంది ప్రజలకు స్వల్పంగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయని అన్నారు. ప్రజల కోరిక మేరకు టెలిస్కోపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని దీని ద్వారా విద్యుత్ చార్జీలు వలన ప్రజలపై పడే భారం స్వల్పమే అన్నారు. 0-30 యూనిట్ లకు విద్యుత్ చార్జీల పెంపుదల చాలా స్వల్పమన్నారు. ప్రజల కోరిక మేరకే ఈ స్లాబ్ లను ఏ పి ఇ ఆర్ సి పెట్టిందన్నారు. 2 వేల 100 కోట్లు ట్రూ అప్ ఛార్జీలుగా వసూలు చేస్తున్నామని, మూడేళ్ళ పాటు ట్రూ అప్ చార్జీలు వసూలు చేయడానికి ఏ పి ఇ ఆర్ సి అనుమతి ఇచ్చిందన్నారు. 2022-23 సంవత్సరానికి ట్రూ అప్ చార్జీలు క్రింద 700 కోట్లు, విద్యుత్ చార్జీలు పెరుగుదల రూ. 1400 కోట్లు కలిపి రూ. 2100 కోట్లు మాత్రమే వసూలు చేస్తుంన్నామన్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ దే అన్నారు.
2022-23 లో 45 వేల కోట్లు ఖర్చు ఉందని వాటిలో 11 వేల 123 కోట్లు లోటు అని ఈ 11 వేల 123 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వాటిలో ఉచిత విద్యుత్ కు రూ. 4511 కోట్లు కాగా, డొమెస్టిక్ కు రూ.4,037 కోట్లు సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సింగల్ టారిఫ్ టెలిస్కోప్ విధానం ద్వారా స్లాబ్ ను ప్రవేశపెట్టామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు గనులు లేవని ఒరిస్సా, తెలంగాణా రాష్ట్రాలపై ఆధార పడి బొగ్గు కొనుగోలు చేస్తున్నామని బొగ్గు రేట్లు పెరుగుదల రవాణా చార్జీలు పెరగడం డీజిల్ ఇతరాల పెరుగుదల కారణంగా ఏడాదికి 14 శాతం ఉత్పత్తి వ్యయం పెరుగుతుందని దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచవలసి వచ్చిందని అయన అన్నారు. రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ ధర్మల్ ద్వారా విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో నిన్న 230 మిలియన్ యూనిట్లు డిమాండ్ కాగా, 180 నుండి 190 మిలియన్ ల పి పి ఏ లు అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణాలో రూ. 5600 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రూ. 1400 కోట్ల మేరకు మాత్రమే విద్యుత్ చార్జీలు పెరగనున్నాయన్నారు. పి పి ఏ లను రద్దు చేయలేదని ధరలను సమీక్షించమని ప్రభుత్వం ఆయా కంపెనీలను కోరిందన్నారు. సెకి నుండి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్ సరఫరా కోసమే సెకి నుండి కొనుగోలు చేసిన విద్యుత్ ను వినియోగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వలన మొత్తం విద్యుత్ రంగ అప్పులు రూ. 85 వేల కోట్లకు చేరిందని, ఈ ప్రభుత్వం రూ. 35 వేలకోట్లు విద్యుత్ కు సంబంధించి వివిధ సంస్థలకు అందించిందన్నారు.
నూతన టారిఫ్ విధానం వలన విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెరిగాయన్నారు. 250 యూనిట్లు విద్యుత్ వాడే వినియోగదారుడు మొదటి 30 యూనిట్లు వరకు యూనిట్ కు రూ. 1-90 పైసలు, 31 నుండి 75 యూనిట్ల వరకు రూ. 3 లు, 125 యూనిట్ల వరకూ రూ. 4-50 పైసలు, 76 నుండి 225 యూనిట్ల వరకు రూ. 6-00 లు, 226 నుండి 400 యూనిట్ల వరకూ రూ. 8-75 పైసలు, ఆ పైబడి రూ. 9-75 పైసలుగా విద్యుత్ చార్జీలను ఏ పి ఇ ఆర్ సి నిర్ణయించిందన్నారు. విద్యుత్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, 2022-23 సంవత్సరానికిగాను విద్యుత్ చార్జీలు స్వల్పంగా పెంచామని, పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. శ్రీధర్ అన్నారు. 2022-23 టారిఫ్ వివరాలను తెలియజేసారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి కారణంగా డిమాండ్ పెరిగిందని అందుకే 230 మిలియన్ యూనిట్లు వినియోగం అవుతుందన్నారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంటుందన్నారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ దువ్వూరి, ఏ పి ఇ పి డి సి ఎల్ సి.ఎమ్.డి. లు సంతోష్ కుమార్, పి, జనార్ధన రెడ్డి, ఏ పి ట్రాన్స్ కో జె.ఎమ్.డి. ఐ. పృథ్వి రాజ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *