ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుమంచిలి గ్రామంలో 18 ఎకరాల లో ఉన్న పెద్ద చెరువు పూడికతీత పనులు చేపట్టడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల దాహార్తి ని తీర్చగలుగుతామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం పెనుమంచిలి గ్రామంలో చెరువు పూడికతీత పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధిహామీ పనులను చేపడుతూన్నామన్నారు అందులో భాగంగానే పెనుమంచలి గ్రామంలోని 18 ఎకరాల పెద్ద చెరువులో పూడిక తీత పనులు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం పెదమల్లం గ్రామంలో శ్రీ మాచేనమ్మ గ్రామ దేవతను దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేశారు. ఆచంట వేమవరం గ్రామంలో శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి 150 వ జయంతి ఉత్సవాలలో డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహారావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి సాహితీ పురస్కారాన్ని దాయన చంద్రజి మంత్రి అందచేశారు.
Tags achanta
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …