-నున్న లో అతి పెద్ద వెంచర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అందరికీ అందుబాటులో సామాన్యులకు సైతం సొంతింటి కల నెరవేర్చేవిధంగా ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఉంటుందని ఆ సంస్థ ఎమ్.డి తెల్ల సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం గురునానక్ కాలనీ రోడ్డులోని ఎన్.ఏ.సీ కళ్యాణ మండపంలో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్.డి తెల్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ వలన ఎన్నో సమస్యలు తల్లెత్తాయని, అధిక ధరలు వలన సామాన్య మానవుడికి సొంతింటి కల దూరంగానే ఉండిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు సొంతింటి కళ నెరవేరే విధంగా అతి తక్కువ ధరలలో ఫ్యూజన్స్ “గోల్డెన్ ఆర్చిడ్స్” @ నున్న వెంచర్ ను అందిస్తున్నామన్నారు. ఈ వెంచర్ సిఆర్డిఏ అనుమతులతో పూర్తి రక్షణ తో అన్ని వసతులతో ఉందన్నారు. తమ వెంచర్ నందు జిమ్ ఫెసిలిటీ, యోగా సెంటర్, స్విమ్మింగ్ పూల్, మినీ హాల్, థియేటర్, వాటర్ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్, కాంపౌండ్ వాల్, సి.సి రోడ్స్ విత్ ఫుట్పాత్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొదలైనవి ఉన్నాయన్నారు. అంతేకాకుండా తక్షణమే ఇల్లు కట్టుకునే విధంగా సువిశాలమైన స్థలంలో విల్లాస్ ను ఏర్పాటు చేసుకోవచ్చని, అలాగే వాస్తులతో కూడిన తూర్పు, పడమర స్థలాలు ఉన్నాయని తక్షణమే ఇళ్లను నిర్మించుకోవచ్చని తెలిపారు. తమ వెంచర్ విజయవాడలో నన్ను ప్రాంతంలో ఉండటం వలన ఆసియాలో బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ పక్కనే ఉందని, అలాగే వాక్ డిస్టెన్స్ తో రెండు వందల మీటర్ల దూరంలోనే నేషనల్ గ్రీన్ హైవే ఉందని, అంతేకాకుండా పేరుగాంచిన వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ, లింగయ్య ఇంజనీరింగ్ కాలేజీ, ఎన్.ఆర్.ఐ ఇంజనీరింగ్ కాలేజీ,పాలడుగు పార్వతి దేవి కాలేజీ ఉన్నాయన్నారు. తమ వెంచర్ లో ఇల్లు కట్టుకుంటే అటు ఇంటర్ నేషనల్ స్కూల్స్ కి, కళాశాలలకు, ఇండస్ట్రీస్ కు, మల్టి హాస్పిటల్స్ కు అతి దగ్గరలో ఉంటామని, వాతావరణ కాలుష్యానికి దూరంగా చక్కటి ప్రశాంత వాతావరణంలో సువిశాలంగా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెల్ల వెంకటరమణ భూమి నాగేశ్వరావు కొమ్మినేని నాగేశ్వరావు ఎన్ రవి శంకర్ మేనేజర్ శ్రీనివాసరావు, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.