విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ పైడిపాటి చైతన్య రెడ్డి, భవానిపురం మురళీకృష్ణ ల చేతుల మీదగా హెచ్ బి కాలనీ లోని అప్నా బజార్ సెంటర్లో నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కృషి చేస్తున్నారని , దీనినే స్ఫూర్తిగా తీసుకుని నగరంలో మరికొన్ని చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. భవనిపురం సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈరోజు జర్నలిస్టు మిత్రులు చాలా మంచి కార్యక్రమం చేపట్టారని, అమరావతి వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నగరంలో ప్రధానంగా మా భవానిపురం ప్రాంతంలో ప్రారంభించడం చాలా ఆనందాన్నిచ్చిందని ఇదే స్ఫూర్తిని వారి కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, ప్రధాన కార్యదర్శి మధుసూదన కుమార్ ఇతర అసోసియేషన్ సభ్యులు జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …