Breaking News

ఆర్టీసీ హౌస్ లో రవాణాశాఖా మంత్రి  పేర్ని నాని సమీక్షా సమావేశం…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణాశాఖామంత్రి  పేర్ని నాని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బుధవారం ఆర్టీసీ హౌస్ లో ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కోవిడ్ తర్వాత మెరుగైన పరిస్థితుల నేపధ్యంలో సమీక్ష జరిపి భవిష్యత్తులో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు కల్పించవలసిన సౌకర్యాల గురించి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల రద్దీ క్రమేపి పుంజుకుంటున్న తరుణంలో ఓ.ఆర్. మరింతగా పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రయాణికుల అవసరాల మేరకు బస్సు సర్వీసులను నడపాలని ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి- ఇటు సంస్థకు, అటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజన వలన ఆయా జిల్లాల కేంద్రాలకు బస్సులు నడిపే విషయంలో తగు నిర్ణయాలు త్వరితగతిన తీసుకుని ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించాలన్నారు. మారుమూల ప్రాంతాల వాసులకు కూడా ఇబ్బంది తలెత్తకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎం.టి.కృష్ణబాబు, ఐ.ఏ.ఎస్. , రవాణా శాఖ కమిషనర్  భాస్కర్, ఐఏఎస్, ఆర్టీసీ ఎం.డి.  సి.హెచ్. ద్వారకాతిరుమల రావు, ఐ.పి.ఎస్., సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు  ఏ.కోటేశ్వర రావు,  పి.కృష్ణ మోహన్,  బ్రహ్మానందరెడ్డి మరియు ఫైనాన్షియల్ అడ్వైజరు రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *