విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్ఎస్ ప్రవీణ్‌చంద్, యంపిడివోలు, తహాశీల్థార్లు, గృహా నిర్మాణ శాఖ అధికారులతో నిర్మాణ పనుల ప్రగతిపై బుధవారం కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాలో జరుగుతున్న గృహా నిర్మాణాల పనులు ఊపందుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు ఆదేశించారు. మంజూరైన అన్ని గృహాలు ప్రారంభం కావాలన్నారు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి గుంతలు తవ్విన వెంటనే 15 వేల రూపాయలు లబ్ధిదారులకు అందించాలన్నారు. అన్ని గృహాలు బెస్మెంట్ స్థాయికి తీసుకురావాలని, నిర్మాణ పనుల వివిధ దశలు పూర్తి అయిన వెంటనే బిల్లులను అన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్, లబ్దిదారులకు పెండిరగ్ లేకుండా అందుబాటులో ఉంచాలన్నారు. జగనన్న కాలనీల్లో గృహా నిర్మాణాలు చివరి దశకు వచ్చిన చోట సిసిరోడ్లు, డ్రైనేజ్, ఇంటింటి కుళాయి తదితర సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఢల్లీిరావు అధికారులను ఆదేశించారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …