Breaking News

నగరంలో నూతనంగా సిరి డ్రెస్ డీవైన్ షోరూం ప్రారంభం… 


విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
బందరు రోడ్, పివీపీ మాల్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శిరి డ్రెస్ డివైన్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభమయింది. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె, వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. వెలంపల్లి సాయి అశ్విత ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ లు జ్యోతి ప్రజ్వలనను చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం.శేషగిరిరావు, ఎండి ఎం.సురేష్ కుమార్ లు మాట్లాడుతూ 1993లో ఏలూరులో ప్రారంభించి వెస్ట్ గోదావరిలో అందరి మన్ననలు పొందుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కస్టమర్ల హృదయాల్లో పేరు సంపాదించిన మేము మాకు వున్న సుమారు 26 సంవత్సరాల అనుభవంతో ఇక్కడ పిల్లలతోపాటు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందరికి 499 రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు అందుబాటు ధరలలో వివిధ క్వాలిటీలలో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌, మ్యాచింగ్స్‌, జార్జెంట్‌, శాటిన్‌, క్రేప్‌, పింటెడ్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌, డ్రెస్‌సెట్స్‌, లెహెంగాస్‌, కావలసిన తదితర అన్నిరకాల ఫ్యాబ్రిక్స్‌ లభించేలా ఏర్పాటుచేశామన్నారు. కస్టమర్స్‌ అందరూ ఒకసారి సందర్శించి నూతన అనుభూతిని పొందాలన్నారు. ఇది ఎక్స్‌క్లూజివ్‌ షోరూం అని, కస్టమర్ దేవుళ్ళ ఎక్స్‌పీరియన్సే మోటాగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ, పాశ్చాత్య దుస్తులు సైతం షో రూమ్ లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆధునిక యువతులు, మహిళలు ధరించే అన్ని రకాల అధునాతన వస్త్ర శ్రేణి తమ వద్ద లభ్యమవుతాయని వివరించారు. వెడ్డింగ్ డ్రస్సులు తమ ప్రత్యేకత గా తెలిపారు. విజయవాడ వాసుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సినీ హీరోయిన్ డీజే దిల్లు ఫేమ్ నేహా శెట్టి, నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె డాక్టర్ అశ్విత, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, వక్తలు మాట్లాడుతూ వస్త్రాభిమానులకు కుటుంబంలోని అందరికీ అన్ని రకాల వెరైటీస్ ఒకే చోట అందుబాటు ధరలలో శిరి డ్రెస్ డివైన్ షోరూం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. షోరూం దినదినాభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. యువతులకు నచ్చే, వారు మెచ్చే ఎన్నో నాణ్యమైన, మన్నికైన ఆధునిక వస్త్రాలు శిరి డ్రెస్ డివైన్ షోరూంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా కొనుగోలుదారులతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *