Breaking News

విజయవాడ ఆటోనగర్ లో వ్యాపారుల బంద్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌ వ్యాపారులు, కార్మికులు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబర్‌ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం బంద్‌ చేపట్టారు. ఆసియా ఖండంలోనే ఆటోనగర్‌ అతిపెద్దదని కార్మికులు చెప్పారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్‌ చేస్తామనడం సమంజసం కాదన్నారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ఈ జీవోలు తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్‌కు తాజా జీవోల నుంచి వెసలుబాటు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్‌గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తూ 50శాతం పన్ను చెల్లించాలన్న జీవోను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. తమకు స్థలాలు ఉచితంగా రాలేదని కార్మిక సంఘాలు, వ్యాపారులు తెలిపారు. ఆటోనగర్‌పై సుమారు లక్ష మంది ఆధారపడి ఉన్నారని.. రవాణా రంగం అభివృద్ధికి ఈ ప్రాంతం చాలా ఉపయోగపడిందన్నారు. 50శాతం పన్ను చెల్లించడం తమ వల్ల కాదని స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలు నడుపుకొనే వారు ఇంత పన్ను కట్టగలరా అని ప్రశ్నించారు. పరిశ్రమలు తరలిపోతే మనుగడ కష్టమవుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్, అధ్యక్షులు రాజనాల వెంకట రమణారావు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

6.60 కోట్లతో నిర్మించనున్న జి.టి.యస్ పనులకు శంకుస్థాపన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో శాస్తీయ పద్దతిలో వ్యర్దాల నిర్వహణకు జి.టి.యస్ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ సిస్టం) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *