అను హాస్పిటల్లో ఎండోక్రైనాలజీ సేవలు

-డాక్టర్ వరుపుల భాను ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎండోక్రైనాలజీ విభాగం
-మధుమేహం, ఎండోక్రైనాలజీ, హార్మోన్ సమస్యలకు అత్యుత్తమ వైద్యం
-అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని పేర్కొన్న అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్యాంధ్రలోని అగ్రగామి వైద్యసంస్థల్లో ఒకటిగా పేరొందిన అను హాస్పిటల్ నందు ఎండోక్రైనాలజీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ జి. రమేష్ తెలిపారు. ఎండోక్రైనాలజీ, మధుమేహవ్యాధి చికిత్సల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ వరుపుల భాను ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఎండోక్రైనాలజీ విభాగం నిర్వహింపబడుతుందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న ఎండోక్రైనాలజీ విభాగం గురించి వివరించేందుకు ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ నందు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ జి. రమేష్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని అన్నారు. అందులో భాగంగానే డాక్టర్ భాను ప్రవీణ్ సారథ్యంలో ఎండోక్రైనాలజీ సేవలను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. యూకేలో 12 ఏళ్ల అనుభవం కలిగిన డాక్టర్ ప్రవీణ్, ఎండోక్రైనాలజీ, హార్మోన్ల అసమతుల్యత, మధుమేహవ్యాధి తదితర సమస్యలకు అత్యున్నత చికిత్సలను అందిస్తారని డాక్టర్ రమేష్ తెలిపారు. అనంతరం డాక్టర్ వరుపుల భాను ప్రవీణ్ మాట్లాడుతూ అత్యుత్తమ వైద్య సేవలకు ప్రఖ్యాతిగాంచిన అను గ్రూపులో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. అను హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగం ద్వారా షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక బరువు, ఎముకలు గుల్లబారడం, కొలెస్ట్రాల్ సమస్యలు, మహిళల్లో ఋతుక్రమ సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల లోపాలు, నపుంసకత్వం, యుక్తవయసులో హార్మోన్ సమస్యలు, అవాంఛిత రోమాలు, పీసీవోడీ తదితర సమస్యలకు ప్రపంచశ్రేణి సాంకేతికతో, అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలను అందిస్తామని చెప్పారు. మధుమేహవ్యాధిగ్రస్తులకు కేవలం గ్లూకోజ్ నియంత్రణతో సరిపెట్టకుండా, షుగర్ వ్యాధి కారణంగా గుండెజబ్బులు, పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నిర్ధిష్టమైన ప్రణాళికతో చికిత్సలను అందిస్తామని డాక్టర్ భాను ప్రవీణ్ వెల్లడించారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు అత్యాధునిక డయాబెటిక్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అత్యంత అనుభజ్ఞులైన వైద్య బృందం ఆధ్వర్యంలో మధుమేహరోగులకు సమగ్రమైన చికిత్సలను అందిస్తున్నామని పేర్కొన్నారు. షుగర్ పేషేంట్లలో ఎక్కువగా కనిపించే డయాబెటిక్ ఫుట్ సమస్యకు తమ హాస్పిటల్ నందు అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ ఎం. భవానీ శంకర్, డయాబెటిక్ ఫుట్ సర్జన్ డాక్టర్ సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *