పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి… 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌ సోదరులు ఎక్కువగా నిర్వహించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం అయినందున జిల్లా యంత్రాంగం ముస్లిమ్‌ సొదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాల పై శనివారం నగరంలోని కలెక్టర్‌ బంగ్లా (పాత క్యాంప్‌ కార్యాలయం)లో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్లు, వైద్య ఆరోగ్య, పోలీస్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రంజాన్‌ మాసంలో ఆరోగ్య జాగ్రత్తలు, పారిశుద్ద్యం మెరుగుపరిచేందుకు మసీధులు, ప్రార్థనా మందిరాలు, ముస్లిమ్‌లు ఎక్కువగా నిర్వహించే ప్రాంతంలో తగినంత నీటి సౌకర్యం కల్పించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌, మున్సిపల్‌ కమీషనర్లను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ముఖ్యంగా ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రార్థనా సమయంలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ సరఫరా శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. రంజాన్‌ మాసంలో అర్థరాత్రి వరకు 5 సార్లు ప్రార్థనాలు, ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు మసీదులకు హాజరవుతరాన్నారు. జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, తిరువూరు, విజయవాడ ప్రాంతాలలో ముస్లిమ్‌ కుటుంబాలు ఎక్కువగా నివసిస్తున్నారన్నారు. మున్సిపల్‌ కమీషనర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు, సంబంధిత మసీదులు ఉన్న పరిశరాలలో ఉదయం, రాత్రి బ్లీఛింగ్‌ చల్లడం వంటి స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు.ముస్లిమ్‌ సొదరులకు రంజాన్‌ మాసంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జిల్లా మైనారిటి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రియాజ్‌ సుల్తానా, జిల్లా వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజామస్తాన్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *