విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు/ప్రెసిడెంట్ అరసవిల్లి అరవింద్ మరియు ఎక్సెల్ల ఎడ్యుకేషనల్ గ్రూప్స్ సీఈఓ ఆర్. సౌజన్య చేతుల మీదుగా నగరంలోని బందర్ రోడ్, ఏలూరు రోడ్ మరియు ఆటోనగర్ లో చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ వేసవి ఎండల్లో పాదచారుల దాహం తీర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నాం అని ముందు ముందు మరికొన్ని చలివేంద్రాలు నగరం లోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తాం అని, ఇతరులు కూడా అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుండటం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో హర్షణీయం అని ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం లో అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఎక్సెల్లా ఎడ్యుకేషనల్ గ్రూప్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …