ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలి…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో ఇంకనూ ప్రారంభం కాని అన్ని గృహాలను ఈనెల 16వ తేదీలోగా ప్రారంభింప చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు గృహా నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జగనన్న కాలనీలలో జరుగుతున్న గృహా నిర్మాణాల ప్రగతి పై శనివారం కలెక్టర్‌ డిల్లీరావు హౌసింగ్‌ ఏఇలు, ఇఇలు, డిప్యూటి ఇఇలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 82,430 గృహాలు మంజూరు అయ్యాయని వీటిలో వివిధ కారణాలతో ప్రారంభం కాని 25,358 గృహాలను ఈనెల16వ తేది లోగా, నగర పాలక సంస్థ పరిధిలోని గృహాలను ఈనెల 20వ తేదీలోగా బిలో బెస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. బిలో బెస్‌మెంట్‌ స్థాయిలో ఉన్న 48,194 గృహాలను మే 14వ తేదీలోగా బెస్‌మెంట్‌ స్థాయికి తీసుకురావాలని ఇందుకు వారంవారిగా లక్ష్యాలను నిర్థేశించుకుని పూర్తి చేయాలన్నారు. గృహాలను నిర్మించుకునేందుకు లబ్దిదారులు ఆశక్తి చూపకపోవడానికి తగిన కారణాలను తెలుసుకుని వాటిని ప్రారంభించుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో పనులకు అనుకూలంగా ఉన్నందున జూలై నెల లోపే నిర్మాణాలన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక నాయకుల సహాకారం తీసుకోవాలని హౌసింగ్‌ అధికారులు ఉదయాన్నే వారికి కేటాయించిన లేఅవుట్లలో జరుగుతున్న పనులను పరిశీలించాలన్నారు. మహిళ గ్రామైఖ్య సంఘాలను, వాలంటీర్లను, గృహానిర్మాణాల వేగవంతానికి భాగస్వామ్యులు చేయాలన్నారు. అన్ని లేఅవుట్లలో స్టీల్‌, మెటల్‌, ఇసుక, నీటి సౌకర్యాలు వంటి మౌలిక సదుపాయలు కల్పించాలన్నారు. అధికారులు ఉత్సహాంగా పనిచేసి వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసి గృహా నిర్మాణాల ప్రగతిలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్‌ అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎన్‌ అజయ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.శ్రీదేవి, తిరువూరు, నందిగామ, విజయవాడ, నియోజకవర్గ పరిధిలోని ఏఇలు, ఇఇలు, డిప్యూటి ఇఇలు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *