-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
-శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మం, దైవిక సూత్రాలకు అనుగుణంగా మానవులు తమ జీవితాన్ని ఏలా సార్ధకం చేసుకోవాలన్న విషయాన్ని శ్రీరాముడు తన జీవనం ద్వారా మనకు బోధించాడని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శ్రీ రామనవమి నేపధ్యంలో గవర్నర్ రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ రాముడు కరుణ, సౌమ్యత, దయ, నీతి, చిత్తశుద్ధిల స్వరూపంగా నిలుస్తాడన్నారు. ధర్మం, ప్రేమ, సత్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి శ్రీరాముడు మనకు మార్గదర్శకత్వం వహించాలని ప్రార్థిస్తున్నానన్న గవర్నర్, ‘శ్రీరామ నవమి’ పండుగ ప్రతి ఇంట సంతోషకరంగా సాగాలని ఆకాంక్షించారు. దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామ రాజ్యమని విశ్వసిస్తామని, మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడని గవర్నర్ వివరించారు.