విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ వివిధ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ మరియు చలివేంద్రాలు ప్రారంభోత్సవ లో పాల్గొనడం జరిగింది. ఈ ఏడాది శ్రీరామ నవమి కల్యాణోత్సవాలను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా చేసుకుంటున్నారని, రెండు సంవత్సరాలుగా కరోనా విపత్కర సమయం ఉత్సవాలు సరిగ్గా ఏర్పాటు చేసుకోలేకపోయారని, శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ప్రజలు ఆనందంగా ఉండేలా పన్నుల భారం లేకుండా ఈ ఏడాది నుండైనా జగన్ పాలన లో మార్పు రావాలని భగవంతుడు ఆ విధంగా జగన్ కి సద్బుద్ధి ప్రసాదించాలని మహేష్ రాములవారిని ప్రార్థించారు.
1. కోమల విలాస్ సెంటర్ వద్ద శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది . కమిటీ వారు మహేష్ సాదరంగా ఆహ్వానించి దర్శనం అనంతరం కండువా కప్పి సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
2. 26వ డివిజన్ అధ్యక్షులు బాధిత.శంకర్ ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
3. 49వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు అడ్డూరి తమ్మరావు ఏర్పాటు చేసిన కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని అనంతరం పానకం వడపప్పు పులిహార పంపిణీ చేసినారు.
4. గొల్లపాలెం గట్టు వద్ద విల్లా. వీర్రాజు మరియు నాగరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చింతలపూడి సత్యనారాయణ గారి తో కలిసి చేసినారు.
5. నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద భోగి రెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
6. సితార సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు తిరుపతి సురేష్ అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్, నూనె సోమశేఖర్, నల్లబెల్లి కనకారావు, బావి శెట్టి శ్రీను, పోలిశెట్టి శ్రీను, పిళ్ళా రవి తదితరులు పాల్గొన్నారు