-నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా చల్ల ఆది నారాయణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మెజార్టీ పాలకవర్గ సబ్యులు మరల తనను ఎంపిక చేసుకున్నట్లు ఆ సంఘ అధ్యక్షులు చల్ల ఆది నారాయణ (వీనస్ బాబు) తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం విలేకరుల సమావేశం జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8న కొన్ని అనివార్య కారణముల వలన నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన తనను తొలగించినట్లు సంతకాలతో పాలక వర్గ సబ్యులు తీర్మానం చేసారని తెలిపారు. దీనికి తాను ఆ తీర్మానాన్ని అమోదించలేదని ప్రభుత్వం నుండి టైలర్స్ కోసం కృషి చేసే విధంగా కార్యక్రమాలను తీసుకొచ్చానని దానికి కొంత మంది పాలకవర్గ సబ్యులు సహకరించారని తెలిపారు. సదరు పాలక వర్గ సబ్యులను, కమిటీ సబ్యులను పెద్దలను అందర్ని కలుపుకుని, వారి ఆలోచనలను పంచుకుంటూ తమ అసోసియేషన్ కార్యక్రమాలన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కావున మిత్రులైన పాలకవర్గ సబ్యులు తమ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవలసినదిగా కోరారు. తనకున్న కాలపరిమితి పూర్తి అయ్యేవరకు అధ్యక్షులుగా పనిచేసే విధముగా తమరు అమోదించవలసినదిగా కోరారు. సమావేశంలో సెక్రటరి కూరపాటి రాఘవరాజు, కోశాధికారి పిల్లి అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు కె.వి.రాజు, కె.వి.రమణ, ఆర్ ప్రకాష్ రావు, ఎస్.కె అఫ్రోజ్, మొహమ్మద్ ఆసిఫ్, తిరుపతిరావు లు తదితరులు పాల్గొని తిరిగి అధ్యక్షులుగా వీనస్ బాబును కొనసాగించాలని సంతకాలు చేశారు.