-ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
-వచ్చే నెల నుండి జిల్లాలో గ్రామదర్శిని పక్కాగా అమలుకు చర్యలు
-రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని అమలుచేయాలి
-రెవెన్యూ అధికారులకు సూచించిన కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లాలో అందరు ఆర్డీవోలు తాసిల్దార్లు, హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు గృహనిర్మాణం, ఓ టి ఎస్, మీ సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, స్పందన అర్జీల పరిష్కారం, జగనన్న స్మార్ట్ టౌన్స్ పధకం క్రింద ఎం ఐ జి లేఅవుట్ల ఏర్పాటు, భూముల రీ సర్వే, మ్యూటేషన్స్ తదితర అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల నుండి జిల్లాలో గ్రామదర్శిని పక్కాగా అమలు చర్యలు తీసుకుంటున్నట్లు, ఇందుకోసం సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు నెలలో కనీసం 5 గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు, సచివాలయాలు, చౌక దుకాణాలు తనిఖీలు నిర్వహించి నిర్దేశించిన ప్రొఫార్మా పూరించి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, తనిఖీ నివేదికల ఆధారంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, రెండు నెలల్లో జిల్లాలో అన్ని గ్రామాలు ఖచ్చితంగా తనిఖీలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఓ టి ఎస్ స్కీం విధి విధానాల గురించి అందరికీ తెలుసా? తాసిల్దార్ లను కలెక్టర్ ప్రశ్నించారు. ఏదైనా పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసేందుకు ఇచ్చే ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదవి లోతుగా అర్థం చేసుకుని అమలు చేయాలని, ఏమీ తెలుసుకోకుండా సంతకాలు చేస్తే ఇబ్బందుల్లో పడతారని కలెక్టర్ అన్నారు జిల్లాలో ఓ టీఎస్ పథకం అమలు, గృహ నిర్మాణ ప్రగతి హౌసింగ్ పిడి కే.రామచంద్రన్ సమావేశంలో వివరించారు. జిల్లాలో ఓ టిఎస్ లక్ష్యం 90,000 లక్ష్యం కాగా, దీనిలో 68 వేల మంది డేటా ఎంట్రీ జరిగిందన్నారు. 44 వేల మంది లబ్ధిదారులు నుండి 9.60 కోట్ల రూపాయలు ఓ టి ఎస్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 689 లేఅవుట్లు ఏర్పాటు చేయగా, నేటి వరకు 277 లేఅవుట్లలో గృహ నిర్మాణాలు గ్రౌండింగ్ జరిగిందని తెలిపారు. ఓ టి ఎస్ అమలు, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీల పరిష్కారంలో ఒక అర్జీ కూడా గడువు దాటకూడదని కలెక్టర్ ఆదేశించారు. భూముల రీ సర్వే సంబంధించి కృష్ణాజిల్లాలో 502 గ్రామాలకుగాను, 93 గ్రామాల్లో డ్రోన్ ఫ్లై పూర్తయిందని, 63 గ్రామాల్లో సర్వే మ్యాపులు తయారీ పూర్తి అయిందన్నారు. వచ్చే రెండేళ్లలో రీ సర్వే పై ప్రభుత్వo ఫోకస్ పెడుతుందని కావున రీ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. చాలా మ్యూటేషన్స్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోందని, 1971 లో వచ్చిన ఆర్ఓఆర్ యాక్ట్ చిన్నంగా చదివి అప్డేట్ కావాలని కలెక్టర్ తాసిల్దార్ లకు సూచించారు. ఆర్ఓఆర్ యాక్ట్, నియమ నిబంధనలు పట్ల రెవెన్యూ అధికారులకు వర్క్ షాప్ నిర్వహించాలని జాయింట్ కలెక్టర్కు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల మాట్లాడుతూ జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో జగనన్న స్మార్ట్ టౌన్ పధకం క్రింద ఎమ్ ఐ జి లేఅవుట్లు కోసం అనువైన భూములు గుర్తించాలని ఆదేశించారు వివిధ మున్సిపాలిటీలలో ఇప్పటివరకు వచ్చిన అర్జీలు గుర్తించిన భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో ఐ.కిషోర్, గుడివాడ ఆర్ డి ఓ పద్మావతి, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, ముడ వి సి నారాయణ రెడ్డి, ఏడి సర్వే గోపాల్, డి.ఎస్.ఒ పార్వతి, మున్సిపల్ కమిషనర్లు, తాసిల్దార్ లు పాల్గొన్నారు.