Breaking News

ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్ లదే కీలకభూమిక…: దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని,వాటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని రాజరాజేశ్వరి కళ్యాణమండపంలో జరిగిన 11,12,13,14,15 డివిజన్ల సచివాలయ వాలంటీర్ ల ఉగాది పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ అవార్డ్ గ్రహితలకు మెమోంటోలు,నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ఇంత దిగ్విజయంగా జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా సాగుతున్నాయి అంటే వాలంటీర్ ల కృషి తోనే అని,వారు చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వారు ప్రజలకు అండగా నిలిచారని,మన రాష్ట్రంలో కరోనా కట్టడి లో ముందంజలో ఉంది అంటే అది వాలంటీర్ ల పనితీరు వలనే అని అన్నారు. అలాంటి వారిని ప్రోత్సాహించి వారికి కృతజ్ఞతలు తెలువడం కోసమే ప్రతి ఏటా ఉగాదికి వారికి పురస్కారలు అందజేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్టాండింగ్ కమిటీ మెంబర్ తంగిరాల రామిరెడ్డి, కార్పొరేటర్ చింతల సాంబయ్య వైసీపీ ఇంచార్జ్ లు మాగంటి నవీన్,రామాయణపు శ్రీనివాస్,వల్లూరి ఈశ్వర ప్రసాద్ మరియు వైస్సార్సీపీ నాయకులు,నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *