-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికి గృహాలు పథకములో భాగంగా వణుకురు మరియు ఉప్పులూరు జగనన్న కాలనీ లే అవుట్ స్థలములను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గురువారం సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్, ఐ. ఏ ఎస్ మరియు ఇతర అధికారులతో కలసి గృహ నిర్మాణాలకు సంబందించి గ్రౌండింగ్ పనులు పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంగా గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా కాంట్రాక్టర్స్ ని కలిసి జగనన్న లేఅవుట్ లో త్వరగా ఇల్లు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.