విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ముత్యాలంపాడు షిర్డి సాయిబాబా మందిరములో కొలువైన షిర్డి సాయినాధునికి వివిధ రకాల మ్రొక్కుబడులు చెల్లించేందుకు దాత ఆర్యకుమార్ సహకారంతో తూకం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తులాభార కార్యక్రమాన్ని మందిరం గౌరవాధ్యక్షుడు పి.గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. మొదటి తులాభారాన్ని ఎస్.ఆర్.ట్రావెల్స్ అధినేత సుబ్బారావు కందిపప్పు 80కేజీలు సమర్పించి బాబా మ్రొక్కుబడిని తీర్చారు. రెండవ తువాభారాన్ని బండారు దుర్గారావు 75 కేజీల బెల్లం సమర్పించి మొక్కుబడి చెల్లించారు. ఈ సందర్భంగా మందిరం గౌరవాధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, దక్షిణ షిర్డిగా పేరుగాంచిన ముత్యాల సాయికి ఇప్పటి వరకు వారి యొక్క మ్రొక్కులు తీర్చుకొనుటకు భక్తులు ఇబ్బంది పడేవారని తెలిపారు. భక్తుల కోరిక మేరకు తులాభారమును ఏర్పాటు చేయుట జరిగిందన్నారు. బియ్యం, కందిపప్పు, శెనగపప్పు, పెసలు, నూనె, బెల్లం, కలకండ (పటిక బెల్లం) ఆయా భక్తుల కోరికను అనుసరించి మ్రొక్కుబడులు తీర్చుకోవచ్చని తెలిపారు. తులాభారం ద్రవ్యమును నిత్యాన్నదానమునకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …