విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చేనేతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు శనివారం గాంధీనగర్ అలంకార్ ధర్నా చౌక్ వద్ద చలో మహాధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద వృత్తి చేనేత వృత్తి అని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని చేనేత మహాధర్నా కమిటీ సలహాదారు వై కోటేశ్వరరావు అన్నారు.ముడి పట్టు, నూలు ధరలు వెంటనే తగ్గించి 50 శాతం రాయితీతో నెలకు 5 కేజీలు ఇవ్వాలని, నేతన్న నేస్తం పథకం అర్హులైన చేనేత కార్మికులందరికీ అమలు చేయాలన్నారు.కరోనా ప్రభావంతో అమ్ముడుపోక మిగిలిపోయిన బట్టలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి విక్రయించాలని, చేనేత జౌళి శాఖ మంత్రి పదవిని చేనేత వర్గం వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేదంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాలు, చేనేత కుల సంఘాలు, మాస్టర్ వీవర్స్ & వస్త్ర విక్రయదారులు, బీసీ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …