-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి మహాత్మాగాంధీ రోడ్, పిట్టింగుల పేట, బెంజి సర్కిల్, జాతీయ రహదారి మరియు లయోలా కాలేజీ రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులు పలు సూచనలు చేసారు. ముందుగా యం.జీ రోడ్ గేటువే ఎదురు రోడ్ నందు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించాలని సూచిస్తూ, సెంట్రల్ డివైడర్ నందలి గ్రీనరిని పరిశీలించగా ఇంపుగా పెరిగిన మొక్కలకు ట్రిమ్మింగ్ సక్రమముగా లేకపోవుట గమనించి, మొక్కలను ఆకర్షనీయంగా ట్రిమ్మింగ్ చేయాలని ఉద్యాన వనశాఖాదికరులను ఆదేశించారు. ట్రెండ్ సెట్ మాల్ సర్వీస్ రోడ్ నందలి డ్రెయిన్ నందు డి సిల్టింగ్ పనులు నిర్వహించాలని అన్నారు. అదే విధంగా పిట్టింగ్ పేట నందలి సర్వీస్ నివాసాల వారికీ మరియు స్క్రాప్ వ్యాపారుల వారు ఇష్టానుసారం రోడ్ల ఉండుట గమనించి సదరు రోడ్ నందు మార్జిన్ ఏర్పాటు చేయుటతో పాటుగా వ్యాపారులకు నోటీసు ఇచ్చి మార్జిన్ ప్రకారం వ్యాపారాలు సాగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిసిలిస్తూ, లయోలా కాలేజీ రోడ్ హనుమాన్ ట్రావెల్స్ జంక్షన్ వద్ద డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని మరియు డ్రెయిన్ నందు వ్యర్దములు ఎగువకు వెళ్ళకుండా గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతాభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, జోనల్ కమీషనర్ పార్ధసారధి మరియు ఇతర అధికారులు శానిటరీ సెక్రటరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.