-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన అన్ని ప్రభుత్వ సంస్థల వారు వారి సంస్థల భవనాలు, కార్యాలయాలకు సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కేదారేశ్వర పేటకేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ నకు సంబందించి 2011-12 నుండి 2021-22 నకు సంబందించి నగరపాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్థి పన్ను బకాయిల మొత్తము రూ. 33,71,814/- లకు చెక్కు ను నేడు నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్ మరియు కమిషనర్ లకు అందజేసారు. అదే విధంగా వారి డిపార్టుమెంటు నకు సంబందించి ఇతర భవనములకు సంబంధించి చెల్లించవలసిన రూ.11 లక్షల బకాయలను కూడా సత్వరమే చెల్లించుటకు సుముఖతను వ్యక్తం చేసారు. ఇదే విధంగా బి.ఎస్.ఎన్.ఎల్ వారు రూ.48 లక్షలు చెల్లించుట జరిగిందని పేర్కొన్నారు. నగరంలో ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ శాఖల వారు కూడా ముందుకు వచ్చి నగరపాలక సంస్థ కు సంబందించిన చెల్లించవలసిన ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 30 తేదీ లోగా చెల్లించునట్లుగా సహకరించాలని, 2022-23 సం.పన్ను పై 5% రాయితీ పొందుట తో పాటుగా నగర ప్రజలకు ఇంకను మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించుటలో సహకరించాలని ఈ సందర్భంగా పిలువునిచ్చారు. ఈ సందర్భంలో నగరపాలక సంస్థకు సంబంధించి పన్ను బకాయిల మొత్తం చెల్లించిన ప్రభుత్వ సంస్థల వారిని అభినందించారు.