విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక వాసవి కల్యాణ మండపం నందు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీపై తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20,21,22 డివిజన్లకు సంబంధించి 748 మహిళ సంఘాలకు లబ్ది చేకూరేలా రూ.10172917/- నిధులను మూడో విడత నిధులను తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విడుదల చేయడం జరిగింది. అవినాష్ మాట్లాడుతూ అక్కాచెల్లెళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వంజగనన్న ప్రభుత్వం అని అన్నారు. ప్రతిఅక్కా చెల్లెమ్మల ఆర్థిక అభివృద్ధికి మనందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతికి పాటు పడుతున్నారని ఈ క్రమంలో జగన్ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పని చేస్తుంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను నిలిపివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు తనకు అనుకూలంగా ఉన్న పత్రిక ను వాడుకుంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి,21వ డివిజన్ ఇంచార్జి పుప్పాల రాజా మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …