తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని కృష్ణాజిల్లాలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు ఇప్పటినుండే పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్ లో నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించడానికి ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణాజిల్లాకు నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుండి ఎడమ గట్టు వైపు ఏలూరు కాలువ ,రైవస్ & దిగువ పుల్లేరు కాలువ పౌల్ రాజు కాలువ , బంటుమిల్లి కాలువ, కాంప్బెల్ కాలువ, బందరు కాలువ, ఆర్.ఆర్.పాలెం , ఎగువ పుల్లేరు కాలువ కృష్ణా ఎడమగట్టు కాలువల ద్వారా జిల్లాలోని ఏ ప్రాంతాలకు ప్రవహిస్తాయో ఇరిగేషన్ అధికారులను వివరంగా అడిగి నీటిపారుదల శాఖకు సంబంధించిన కాలువల ప్రవాహ మ్యాప్ ద్వారా వివరంగా కలెక్టర్ తెలుసుకొన్నారు. విడుదలైన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రజలు వినియోగించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అధికారులను సూచించారు. తాగునీటి చెరువులను నీటితో నింపుకోవడానికి తీసుకొను చర్యలపై ఆర్డబ్ల్యుఎస్, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గత పది రోజులుగా కాలువల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని జిల్లాలోని అన్ని చెరువులు నిందుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. వీటన్నింటికి యుద్ధప్రాతిపదికపై ఆర్డబ్ల్యుఎస్, ఇగిరేషన్ అధికారుల సమన్వయంతో నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాలువ నుండి విడుదలయ్యే నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల చెరువులు, వ్యవసాయ పనులకు ఉపయోగించకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రకాశం బ్యారేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజా స్వరూప్ , డ్రైనేజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గోపాల్ , జిల్లా నీటిపారుదల అధికారి శ్రీనివాస్, ఆర్డబ్ల్యుఎస్ ఏ ఈ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *