విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలుపరుస్తు ప్రజల చేత జై జై లు కొట్టించుకుంటు, ప్రజల మన్ననలు పొందుతున్నఒకే ఒక్కడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మంగళవారం నాడు పరిటలా ఓంకార్ కళ్యణ మండపం వేదికగా నియోజకవర్గ పరిధి లోని 4,10 మరియు 11 డివిజన్ల సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 195 స్వయం సహాయక సంఘాలకు దాదాపు 28 లక్షల 27 వేలు నమూనా చెక్కును దేవినేని అవినాష్ చేతుల మీదగా డ్వాక్రా మహిళలకు అందజేశారు. తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు తో కలిసి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ వైయస్ఆర్ సున్నా వడ్డీ మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుందని అన్నారు. గడిచిన ప్రభుత్వాలు ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచిన తరువాత హామీలను నెరవేర్చని ప్రభుత్వాలను మనం చూశామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ఇస్తే మాటమీద నిలబడే వ్యక్తి అని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. నవరత్నాల ద్వారా ఇచ్చిన హామీలనే కాకుండా రాష్ట్రంలో సుమారు 34 సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ చెల్లిస్తామని చెప్పి సుమారు మూడు వేల కోట్లు ఎగనామం పెట్టి చివర్లో పసుపు కుంకుమ అని చెప్పి పదివేలు వేసి సరిపెట్టింది అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ, వైస్సార్సీపీ నాయకులు చిమాటా బుజ్జి, ఉదయ్, సందీప్ రెడ్డి, కావాటి దామోదర్, జె జె సింగ్, గల్లా రవి, చందు, షౌకత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …