-మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు
-మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పముతో సున్నా వడ్డీ పధకం
-మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వి.ఎల్.దత్తు హై స్కూల్, కేదారేశ్వరపేట నందు 34, 35, 54, 55, మరియు 56 వ డివిజన్లకు సంబందించి నిర్వహించిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏ.పి.ఐ.డి.సి. చైర్మన్ బండి పుణ్యశీల మరియు ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి 657 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. 86,67,935/- చెక్కులను అందజేసారు.
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం క్రింద 3591 సంఘాల వారికీ రూ.4,89,48,502/- (నాలుగు కోట్ల ఎనబై తొమ్మిది లక్షల నలబై ఎనిమిది వేల ఐదు వందల రెండు ) అందించామని పేర్కొన్నారు. జగనన్న సుదీర్ఘ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ పధకం అమలు చేస్తూ, కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ సంక్షేమ పథకాల అమలల్లో వెనకడుగు వేయలేదన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ, అన్ని రంగాలలో మహిళలు ముండుండేలా చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఇళ్ళు, వారి పేరున ఇళ్ళ పట్టాలు అందించిన ఘనత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి దే అని పేర్కొన్నారు.
నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభ్యునతికి ముఖ్యమంత్రి అధిక ప్రాదాన్యత ఇచ్చారని, ప్రజా సంక్షేమ పధకములతో ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పముతో పొదుపు సంఘాలలో రుణాలు అందించుట ద్వారా ఎంతో మంది చిరువ్యాపారాలు జీవనం సాగిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వం గత మూడేళ్ల కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి మహిళలను పరిపాలనలో భాగస్వాములను చేసి ఉన్నత పదవులను అప్పగించారని అన్నారు. అనంతరం మేయర్ కార్పొరేటర్లతో కలసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కార్యక్రమములో కార్పొరేటర్లు బాలసాని మణిమ్మ, అబ్దుల్ అకీమ్ అర్షద్, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, యలకల చలపతిరావు జోనల్ కమిషనర్ సుధాకర్, సి.డి.ఓ దుర్గాప్రసాద్, యు.సి.డి సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.