విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని కర్నాటి రామ మోహనరావు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ కేంద్రాలలో 28,680 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని, ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు. పరీక్ష నిర్వహణకు 176 మంది చీఫ్ సూపరింటెండెంట్ లను, 22 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. జిల్లాలో పరీక్ష కేంద్రాలలో 1500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. మే 9 తేది వరకు పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …