-రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి ధర్మాన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్ని శాఖలకూ రెవెన్యూ శాఖ తల్లి వంటిదని, దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధానిలో భూ పరిపాలన ప్రధాన సంచాలకుల కార్యాలయాన్ని ఏపీఐఐసీ భవనంలో ప్రారంభించి సంబంధిత సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. భవనాన్ని తమ శాఖకు అప్పగించినందుకు ఏపీఐఐసీకి కృతజ్ఞతలు చెబుతూ, విశాలమయిన భవనంలో సిబ్బంది బాగా పనిచేసి, మంచిపేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. తన నేతృత్వంలో కొత్త భవనం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని, ఎక్కడైనా సిబ్బంది పనితీరే శ్రీ రామ రక్ష అని అన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.