విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు గురువారం నియోజకవర్గంలోని రాజ రాజేశ్వరి కల్యాణ మండపం నందు 9,12,13 మరియు 14 డివిజన్ల సంబందించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 625 స్వయం సహాయక సంఘాలకు దాదాపు ఒక కోటి 17 లక్షల 42వేల రూపాయల నమూనా చెక్కును దేడ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పధకం ద్వారా మంజూరైన చెక్కులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి దేవినేని అవినాష్ స్వయంగా అందచేసారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వాకంతో సి,డీ గ్రేడులకు పడిపోయిన గ్రూపులను ఇప్పుడు ఏ గ్రేడ్ లోకి తెచ్చిన ఘనత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1.36 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఎకౌంటు లోకి జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దని అన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అవుతుంది అంటూ చంద్రబాబు నాయుడు ఆయన భజన ఛానల్స్ చేసే తప్పుడు ప్రచారాలు మా వైస్సార్సీపీ ప్రభుత్వం మీద చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. కరోనా కష్టాలు చుట్టుమూట్టిన,ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని, మన రాష్ట్రంలో మహిళా సోదరిమణులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆవకాశాలు ఏ రాష్ట్రంలో లేవని వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగాలలో సైతం 50% రిజర్వేషన్లు కల్పించమాని, చట్టసభల్లో కూడా మీకు 50% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ మాత్రమే అని, అమ్మ ఒడి ద్వారా పిల్లల చదువు అమ్మలకు భారం కాకుండా నేరుగా తల్లి ఎకౌంటు లోకి డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు. ఇవి అన్నీ వదిలేసి కేవలం మందు బ్రాండ్లు బాగోలేదని, మందు ధరలు పెంచారు,విద్యుత్ చార్జీలు పెంచారు అని టీడీపీ వాళ్ళు దొంగ దీక్షలు,తప్పుడు ప్రచారాలు చేయడం సరి కాదు అని అన్నారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రజలందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని కోరారు.జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నాతో పాటు,లక్షలాది మంది ప్రజలు సమర్దిస్తున్నారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారని ఉద్ఘటించారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి,14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య,9వ డివిజన ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,12వ డివిజన ఇంచార్జ్ మాగంటి నవీన్,13వ డివిజన ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్, 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్,14వ డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గా ప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు ఉకోటి రమేష్,సన్నీ,కన్నా బాబు,కోలా ఉమా తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …