కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారిచే రూపొందించిన వార్షిక నివేదికను గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి అందించేందుకు గాను కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి, కమిషన్ సభ్యులు (జుడిషియల్) దండే సుబ్రహ్మణ్యం, సభ్యులు (నాన్ జుడీషియల్) డాక్టర్ శ్రీనివాస రావు గోచిపాత లు శుక్రవారం ఉదయం విజయవాడ లోని రాజభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కి కమిషన్ వార్షిక నివేదిక అందించనున్నారు. అనంతరం కమిషన్ విజయవాడ లో క్యాంపు సిట్టింగ్ నిర్వహించనున్నారని కమిషన్ సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తేలియచేశారు.
Tags karnul
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …