10 వ తరగతి పరీక్షలకు సంబంధించి నిన్న, ఈరోజు ఎటువంటి పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదు

-కొన్ని టీవీ ఛానళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నాయి
-నంద్యాల జిల్లాలోని అంకిరెడ్డి పల్లి జడ్పి హైస్కూల్ లో బుధవారం జరిగిన సంఘటనలకు సంబంధించి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ను, ఎన్నారై విద్యాసంస్థ టీచర్ , మరో 9 మంది టీచర్ల అరెస్ట్ చేశాం
-రాష్ట్రంలో 6,21,240 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు , 3,776 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం
-పరీక్షలు ప్రభుత్వం పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహణ కు అన్ని చర్యలు తీసుకున్నాం
-రాష్ట్రంలో 10 వ తరగతి పరీక్షలు ఎటువంటి లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదన్నారు 
-మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి పేపర్ లీకేజ్ గానీ, మాల్ ప్రాక్టీస్ గా జరగలేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లోని మంత్రి క్యాంపు ఆఫీసు లో గురువారం రాత్రి 10 వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు , తీసుకున్న చర్యలపై మంత్రి పాత్రికేయుల సమావేశంలో వివరించారు . ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 27 వ తేదీ నుంచి మే 6 వ తేదీ వరకు 10 వ తరగతి పరీక్షల నిర్వహణ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, పత్రిరోజు ఉదయం 9. 30 గంటల నుంచి 12. 30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు . వివిధ కారణాల వల్ల పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను 10 గంటల వరకు అనుమతిస్తారని మంత్రి అన్నారు . బుధవారం నంద్యాల స్కూల్ లో జరిగిన సంఘటనలో ఎటువంటి పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని లేదన్నారు . స్కూల్ లో పనిచేసే క్లర్క్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చిన తర్వాత దుష్ట ఆలోచనతో , కొందరి ప్రమేయం తో 10 గంటల తర్వాత ఫొటో స్టాట్ తీసి టీచర్ల కు అందించారని , దీనిపై వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని, దీని వలన ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం నిరోధించగలిగిందని మంత్రి అన్నారు. దీనికి సంబంధించి పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదన్నారు . ఈ సంఘటన పై ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ విచారణ కు ఆదేశించిందని , ఇందుకు బాధ్యులైన ఇద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. 9 మంది ఉపాధ్యాయులపై విచారణ కొనసాగుతుందన్నారు. గురువారం కూడా శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజ్ అయినట్లుగా కొన్ని ఛానళ్ల లో స్క్రోలింగ్ వేశారని, దీనిపై కలెక్టర్, ఎస్పీ, డీఈవో విచారణ చేపట్టారని, ఎటువంటి పేపర్ లీకేజ్ కాలేదని నిర్ధారించారన్నారు. ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలు , కొన్ని టీవీ ఛానళ్ల పట్ల ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు . నంద్యాల లో హైస్కూల్ లో జరిగిన సంఘటన కు సంబంధించి నారాయణ విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ , ఎన్నారై కి విద్యాసంస్థకు చెందిన టీచర్ సుధాకర్ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని మరో 9 మంది టీచర్ల ను పోలీసులు విచారిస్తున్నారన్నారు .
10 వ తరగతి పరీక్షల నిర్వహణ కు సంబంధించి 10 రోజుల ముందు నుండే విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు . గత సంవత్సరం పరీక్షల నిర్వహణ లో ఎటువంటి సమస్యలు ఉత్ఫన్నమయ్యాయని సమీక్షించి అందుకు అనుగుణంగా ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణ లో మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వం పై ఈ పత్రికలు , టీవీ ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, వీటికి లాభమేంటని మంత్రి అన్నారు .ఆన్సర్ షీట్లు కిళ్లీ కోట్లలో , టీ షాపుల్లోనూ దొరుకుతున్నాయని కొన్ని టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని ఇటువంటి అసత్య ప్రచారం చేయడం ద్వారా పరీక్షలు రాస్తున్నవిద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మంత్రి అన్నారు . పరీక్ష రాసే ప్రతి విద్యార్థికి 24 పేజీల ఆన్సర్ షీట్ అందిస్తున్నామని , అటువంటి ఆన్సర్ షీట్లు బయట దొరుకుతాయని ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 6,21,240 మంది విద్యార్థులు 10 వ తరగతి పరీక్షలు రాస్తున్నారని, ఇందుకోసం 3,776 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నానని , రాష్ట్రంలో పరీక్షలు రాస్తున్న 6,21,240 మంది విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ పత్రికలను, టీవీ ఛానళ్ల ను పరీక్షలు అయ్యే వరకు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పిలుపు నిచ్చారు. నంద్యాల లో జరిగిన సంఘటనకు సంబంధించి నారాయణ వైస్ ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేశామని దీనికి చంద్రబాబు, లోకేష్ ఏమి సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు . ప్రభుత్వం చిత్తశుద్ధి తో పరీక్షలు నూరు శాతం కట్టుదిట్టంగా నిర్వహిస్తుందని , ప్రజల మనోభావాలతోనూ , విద్యార్థుల భవిష్యత్ తోనూ ఆటలాడుకోవద్దని , గత రెండు రోజులుగా జరిగిన పరీక్షలలో ఎటువంటి పేపర్ లీకేజ్ గాని, మాల్ ప్రాక్టీస్ గాని జరగలేదని మంత్రి అన్నారు.
ఈ రోజు ఒక పాఠశాలలో స్లాబ్ పెచ్చు ఊడి విద్యార్థికి గాయమైందని, వెంటనే వైద్య సహాయం అందించి ఇంటికి పంపించామన్నారు. ఈ విషయాన్నీ చంద్రబాబు తన ట్విట్టర్ లో ప్రచారం చేస్తున్నారని, గత 10 సంవత్సరాలుగా పాఠశాలలను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి అన్నారు . నాడు -నేడు కార్యక్రమంలో మొదటి దశగా 15 వేల పాఠశాలలు, రెండో దశలో 30 వేల పాఠశాలల రూపురేఖలు మార్చామని, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *