విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సువర్ణాధ్యాయం లిఖించారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం “గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్ శ్రీరామవారి వీధి,మైత్రి వారి వీధి,కళానగర్ మరియు మొహిద్దీన్ ఎస్టేట్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, గ్రామ వార్డ్ సచివాలయల పనితీరు గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం లో ఎవరికైనా ఏదైనా లబ్ది కావాలి అంటే కార్యాలయాల చుట్టూ,టీడీపీ నాయకుల చుట్టూ కళ్ళారిగెల తిరిగి లంచాలు ఇస్తే గాని ఆ పని పూర్తి అవదు అని,జన్మభూమి కమిటీల పేరుతో అక్రమ వసూళ్లు, అవినీతి దందాలు చేసారని కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు, పెన్షన్ పంపిణీ చెప్పేడుతున్నారని,మీకు అర్హత ఉంటే కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా లబ్ది చేకూరుస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న రోడ్లును జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 40 లక్షల రూపాయలుతో రోడ్స్ శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంతాలలో ఉన్న డ్రైన్లు,చిన్న చిన్న రోడ్లు పెండింగ్ లో ఉన్నవి కూడా సాధ్యమైనంత వరుకు పూర్తి చేస్తాం అన్నారు. నియోజకవర్గం లో 400 కోట్లు పెట్టి ఇంత అబివృద్ది పనులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు చేసి నీచ రాజకీయాలు చేయడం తగదు అని అన్నారు. జగన్ గారి మీద రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది అని, అందుకే ప్రజలకు వాస్తవాలు వివరించి వారిలో నెలకొన్న అపోహలను తొలగించడానికి ఈ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టినట్లు అవినాష్ తెలిపారు.పర్యటన లో ప్రజలు ఎదురొచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని,వైస్సార్సీపీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారు అని,వారి సంతోషం చూస్తుంటే జగన్ గారి నాయకత్వం లో పని చేస్తూన్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, డివిజన్ ఇంచార్జి వల్లూరు ఈశ్వర ప్రసాద్,స్టేట్ డైరెక్టర్ గొట్టిపాటి హరీష్ ,జిల్లా ఫిషర్ మెన్ సొసైటీ డైరెక్టర్ ఖాళీ, రాష్ట్ర రజక సంఘ అధ్యక్షుడు శివయ్య,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, వైస్సార్సీపీ నాయకులు గద్దె కళ్యాణ్,జోగేష్,ఉకోటి రమేష్,చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …