ప్రజలకు పాలన చేరువ చేయడానికే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయడమే సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ శర్వాణీమూర్తితో కలిసి జి.ఎస్.రాజు రోడ్డులో శుక్రవారం ఆయన పర్యటించారు. సచివాలయాలలో అందిస్తున్న సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. సిటిజన్‌ ఔట్‌ రీచ్‌లో ప్రభుత్వం 543 సేవలు, పథకాలు పొందుపరిచిందని, వాటిని ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో ప్రతి ఇంటికి సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు తప్పనిసరిగా వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ను వివరించాలన్నారు. ఏయే నెలలలో, ఏయే పథకాలు అమలు అవుతాయనే విషయాలను ప్రజలకు క్లుప్తంగా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు దోనేపూడి శ్రీనివాస్, మైలవరపు రాము, కమ్మిలి రత్న, కూనపులి ఫణి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *