విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రంజాన్ పర్వదినం సందర్భంగా చిట్టినగర్ మోతి మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. మత పెద్దలు ఇమామ్ నజీర్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లాహ్ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై మరియు మీపై ఉంటాయని రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ కి మీకు మంచి భవిష్యత్తు ఉంటాయని ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కమిటీ వారు రంజాన్ సందర్భంగా షామియనా, మంచినీళ్లు, కూలర్లు చక్కగా ఏర్పాటు చేశారని, రంజాన్ అంటే నెల రోజుల పండగ అని, ఈ పవిత్ర మాసంలో ఖురాన్ ఉద్భవించిందని, ఈ పవిత్ర ప్రాంతంలో నుంచొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, ఖురాన్ ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచి లాంటిదని తెలియజేశారు. డివిజన్ అధ్యక్షులు పొట్నూరి.శ్రీను, బొమ్ము రాంబాబు, బత్తుల. వెంకటేష్,రెడ్డిపల్లి గంగాధర్, ఏలూరు సాయి శరత్,శిగినంశెట్టి రాము, జనసేన నాయకులు నూనె జె సోమశేఖర్, తమ్మిన రఘు, బావి శెట్టి శ్రీనివాస్, కె ఎస్ ఎన్ మూర్తి, పోలిశెట్టి శివ,సాంబ తదితరులు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …